Home రివ్యూస్ 7 to 4 మూవీ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

7 to 4 మూవీ రివ్యూ



Friday April 01st 2016

నటీనటులు : ఆనంద్ బచ్చు ,రాజ్ బలా ,లౌక్య  ,   రాధిక తదితరులు 
నిర్మాణం : మిల్క్ మూవీస్ 
దర్శకత్వం : విజయ్ శేఖర్ సంక్రాంతి 
రేటింగ్ : 2/ 5
రిలీజ్ డేట్ : 1 ఏప్రిల్ 2016



 

Editor Review

రాత్రి 7 గంటల నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు జరిగిన సంఘటనల సమాహారం తో తెరకెక్కిన చిత్రం ''7 to 4 ''. విజయ్ శేఖర్ సంక్రాంతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే . 

కథ : 
నరసింహా (ఆనంద్ ) తన టీం మెంబర్స్ అయిన  రవి (రాజ్ ) దుర్గ  (లౌక్య )లిల్లీ (రాధిక ) లతో కలిసి హైదరాబాద్ లో అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని టార్గెట్ చేసి మరీ చిత్రహింసలు పెడుతూ చంపుతుంటారు . పోలీసులు నిఘా పెట్టిన వాళ్ళనే ఈ టీం ఎందుకు టార్గెట్ చేస్తోంది , వాళ్ళ లక్ష్యం ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


హై లెట్స్ :
 
ఎంచుకున్న లైన్ 

డ్రా బ్యాక్స్ : 
స్క్రీన్ ప్లే 

నటీనటులు : 
ఆనంద్ ,రాజ్ , లౌక్య , రాధిక లతో పాటు మిగతా చిత్ర బృందమంతా కొత్త వాళ్ళు అయినప్పటికీ తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు . ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మరింత బాగుండేది . 

సాంకేతిక వర్గం : 
ముందుగా దర్శక నిర్మాత విజయ్ శేఖర్ సంక్రాంతి విషయానికి వస్తే ఎంచుకున్న లైన్ బాగుంది . దేశ వ్యాప్తంగా ,ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న సమస్య ని ఈ చిత్ర కథ గా ఎంచుకుని తన అభిరుచి విభిన్నమైనదని నిరూపించు కున్నాడు అయితే కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం సరిగ్గా రాసుకోవడంలో విఫలమయ్యాడు . నేరుగా కథ లోకి వెళ్లి తర్వాత ఏం జరుగబోతోందో అన్న ఉత్సుకత ప్రేక్షకులు మిస్ అయ్యేలా చేసాడు . ఇదే కథ ని సరైన స్క్రీన్ ప్లే తో అల్లుకుంటే వేరుగా ఉండేది . నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి  . సంగీత పరంగా ఆకట్టుకునేలా లేకపోయినప్పటికీ ఆడవాళ్ళ పై జరుగుతున్న ఆకృత్యాల గురించి వివరించడం లో దర్శకుడు ,సంగీత దర్శకులు విజయం సాధించారు .

ఓవరాల్ గా : 
బర్నింగ్ ఇష్యూ ని కథా వస్తువు గా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందడం కష్టమే అయినప్పటికీ కొంతమంది కి మాత్రం ఈ చిత్రం నచ్చవచ్చు.
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD